Thursday, 6 November 2014

మార్గాన్వేషణ

అందరికీ  ఇలాంటి పరిస్థితులు  జీవితము లో ఒక సారి  ఎదురు అవుతూ  ఉంటాయి .   ఎవరికి  వాళ్ళు ఇలాంటి పరిస్థితులు తమకు ఒకరికే వచ్చాయి  మిగిలిన వాళ్ళు అంతా  బాగానే  ఉన్నారు అనుకొంటూ  బాధ  పడుతూ ఉంటారు.  అలాంటి  పరిస్థితులు నాకు  కూడా ఎదురు అయ్యాయి.   గ్రహ స్థితులు ఎలా  ఉన్నాయి   అని  నా  జాతకము  చూపించుకొంటే బాగుంటుంది  అని సరి అయిన జ్యోతిష్యులు కోసము వెతుకుతూ ఉంటే నాకు దగ్గర లోనే ఒకరు ఉన్నారని తెలిసింది.  అయన మా కుటుంబానికి చాలా తరాల నుంచి ఒకరికి ఒకరం తెలిసి ఉండటం  చేత చనువుతో  ఇవాళ రేపు అంటూ  3, 4  రోజులు  గడిపారు.   ఆ సమయము లో నేనే  ఎందుకు జాతకములు చూడడము  నేర్చుకోకూడదు అని అనిపించి, అలా  నేర్పించే వాళ్ళ కోసము  ప్రయత్నము  చేయడము మొదలుపెట్టాను.  మనసు ఉంటే మార్గము అదే కనిపిస్తుంది  అని మనకు తెలిసిందే కదా!   మనిషి  తను తలుచుకొంటే ఏదైనా చేయగలడు  అన్నట్లుగా  నా ప్రయత్నము ఫలించి నా సహ ఉద్యోగే  నీకు అంతగా నేర్చుకోవాలని ఉందా అయితే  ఎవరో ఎందుకు  నేనే నేర్పుతాను  అని అన్నారు.  ఆయనతో నేను పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆయనకు జ్యోతిష్యం వచ్చని ఎప్పుడు నాకు తెలియదు.  అలా  నా సాధన లో తొలి అడుగు వేయటము జరిగింది.  ఆయన దగ్గఱ నేను  కేవలము 21 రోజుల్లో  జాతక చక్రాలు  ఎలా వేయాలో నేర్చుకొన్నాను.  అయన ఆనందించి ఇలా ఇంత తక్కువ సమయములో ఎవరు నా దగ్గఱ నేర్చుకోలేదు  ఇక నుంచి ఫలితములు గ్రహ స్థితుల బట్టి కాదు ఏదైనా ఉపాసన చేస్తే ఇంకా బాగా చెప్పగలవు అని అన్నారు. 

No comments:

Post a Comment