Wednesday, 5 November 2014

మనసు - శ్వాస

మనసు చంచలమైనది.  ఈ  సృష్టి లో అన్నింటికన్నా వేగముగా పరిగెత్తేది  ఏది  అన్న యక్ష  ప్రశ్నకు  ధర్మరాజు  మనసు అని చెప్పిన సమాధానము మన అందరికి తెలిసినదే.   మనము పూజా కార్యక్రమము లో గాని,  ధ్యాన సమయము లో గాని,  ఇంకా  పలు  సంధర్భముల లో గాని కూర్చున్నప్పటికీ  మన  మనసు  ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుదన్న విషయము,   మనకి తెలిసి యున్న విషయమే.   ఆ  సంధర్భముల లో ఈ మనసు  ఎందుకు అలా  తిరుగుతూ ఉంటుంది,  దానిని  ఎందుకు  కట్టడి చేసి ఉంచ  లేక పోతున్నాము  అని పలు విధములు గా ఆలోచిస్తూ  ఉంటాము.    తెలిసిన  పెద్దలు  అందరినీ  అడుగుతూ  ఉంటాము.  ఈ సమయము నకు మనము  మన   జీవితముల   లో రక రకాల సమస్యలతో సతమతము అవుతూ  వ్యాకుల పడుతూ ఉంటాము.  వీటి అన్నింటి నుంచి విముక్తి  ఎలాగ అని విచారిస్తూ ఉంటాము .  ఈ అవసరమే మనలను  దారులు వెతుకు కొనేలా  చేస్తుంది.   ఇలా  ఆలోచించే సమయము నకు  మానవుడు  తన  అధో  మానసిక స్థాయి  నుండి  ఊర్ధ్వ మానసిక స్థాయి  కి తనకు తెలియకుండా  తాను చేరుకోవడము జరుగుతుంది.   అప్పటి నుంచి  ఎలా ఈ విషయము గురుంచి  తెలిసికోవాలి  ఎవరు  ఈ విషయము గురుంచి చెప్ప గలరు  అని వెతుకుతూ ఉంటాడు. 

No comments:

Post a Comment