Wednesday 12 November 2014

మనసు ను అరికట్టడము ఎలా?

మనసు చంచలము అయినది.  చాలా  వేగముగా పరుగులు  తీసేది అని మనకు అందరికి తెలిసిన విషయము.  దానిని  అరికట్టడము అనే విషయమును పక్కకు బెట్టండి,  కనీసము దానిని ఒక విషయమును గురుంచే  ఆలోచించేలా చేయగల మేమో, చూద్దాము.   సాధారణముగా  మనము  ఖాళీగా  ఉన్నాము అంటే మన ఆలోచనలు  ఒకటి మొదలు పెట్టి, గొలుసుకట్టు గా  ఒక దాని లోంచి ఇంకొక దాని లోనికి  పరుగు తీస్తూ, పర్యవసానమేమిటీ  అంటే  ముందు ఆలోచించే విషయము మర్చిపోయి  ఎక్కడో  ఇంకో విషయములో ఉండగా మనము  స్ఫురణ లోకి వస్తాము.  స్ఫురణ అంటే  ఆలోచనా కెరటాలు నుంచి బయటకు వచ్చి, అదేమిటి  అలా  ఎక్కడి నుంచి ఎక్కడ కు వెళ్లి పోయాము, మనము ఉన్నది ఇక్కడ కదా అని అనుకొంటాము కదా! మనసుని అరికట్టాలి అనుకొంటే అది ఇంకాస్త కష్టము అయి పోతుంది.  ఆ పరిస్థితుల లో  దానిని  దృష్టి పెట్టక పొతే అది ఎక్కువ కదలడము మానుతుంది.  ఇప్పుడు  మన అందరికి అనుభవము లో ఉన్న విషయము ను పరిశీలిద్దాము.  మన ఇళ్ళలో చిన్న పిల్లలు ఉంటారు.   వాళ్ళను  మనము  గారాబము కొద్దీ  చూస్తున్నంత  సేపు  వాళ్ళు మన మాట విన కుండా అల్లరి చేస్తూ ఉంటారు.  అదే వాళ్ళను మనము చూడటము మాని  వేసి మన పని లో పడిపోయాము అనుకోండి, వాళ్ళు అల్లరి చేయడము మాని  బుద్ధి గా మన పక్కనే కూర్చొని  మనము ఏమి చేస్తున్నామో అని చూస్తూ కూర్చుంటారు కదా! అలాగే మన మనసు ను కూడా పట్టించు కోకుండా వదిలేస్తే అది కూడా బుద్ధిగా కూర్చుంటుంది.  మనసు ను గాని పిల్లలను గాని  బలవంతము గా కట్టి ఉంచాలి అని ఆనుకొనే కన్నా వాళ్ళను ఒక కంటి తో చూస్తూ వదిలి వేస్తే  ప్రయోజనము ఎక్కువ ఏమో ఆలోచించి చూస్తే.  వాస్తవానికి  మన దేహ తత్వాలలో, అంతఃకరణ చతుష్టయము లో ఒకటైన మనసు తన దేహమును వదిలి ఎక్కువ దూరము కాదు ఎంత దూరమైనా వెళ్ళ నీయండి అది మళ్లీ వెనుకకు తిరిగి రావలసినదే.  ఎందుకంటే దానికి ఒక అస్తిత్వము లేదు కదా!

No comments:

Post a Comment