Monday 3 November 2014

శరీర మాధ్యమ్ ..........

భూమి మీద జీవించాలి  అంటే  శ్వాస ద్వారా గాలి తీసుకోవాలని  మన అందరికి తెలిసిన విషయమే.   ఈ భూమి మీద నివసించే  ప్రాణులకు  మానవులతో సహా ఒక్కొక్కరికి ఒక్కొక్క  రకముగా  గాలి పీల్చు కొనుటకు  శరీర నిర్మాణము  ఏర్పడింది.     బ్రహ్మ దేవుడు   ఈ వ్యక్తి  ఇంత కాలము  భూమి  మీద  జీవిస్తాడు  అని  సృష్టించడము జరుగుతుందని  మనము  అనుకొంటాము, కానీ యధార్ధానికి  ఈ  వ్యక్తి  ఇన్ని  శ్వాసలు మాత్రము  తీసుకొని  జీవిస్తాడు  అని  అర్ధం చేసుకొంటే  మంచిదని  పెద్దల అబిప్రాయము.   మన  ఋషులు  వారి  తరువాత తరములు అయిన మనందరికీ  ఎన్నో విషయములు  వారి అనుభవములతో కూడిన  జ్ఞానము  నిక్షిప్తము చేసి  అందించారు.
 సాధారణముగా ఒక మనిషి  ఒక  నిముషమునకు  15 శ్వాసలు  తీసుకొని జీవిస్తాడని   ముందే చెప్పారు.     15 శ్వాసలు కన్నా ఎక్కువ తీసుకొన్న వాడు   తక్కువ  రోజులు ,   లేదా  తక్కువ  తీసుకొన్న వాడు   ఎక్కువ రోజులు,  వారి వారి శ్వాసలు  ఉపయోగించిన  విధానము  బట్టి  జీవించుటకు  అవకాశము ఉంది అని కూడా  మన పెద్దలు  తెలియచేసారు.   దీనిని బట్టి  శ్వాస మీద  నియంత్రణ  ఉంటే మన జీవిత కాలమును  మనమే నిర్ణయించు కొనుటకు  అవకాశము  ఉందని  మనకు  అర్ధమవుతోంది  కదా!

No comments:

Post a Comment