Monday 17 November 2014

సాధనా క్రమము ..........

మిర్యాలగూడ లో శ్రీ వెంకటేశ్వర్లు గారి ఇంట్లో ఉన్న వారము రోజుల లో సాయంత్రము సమయములలో నేను అనుకొన్న విధముగా సత్సంగములు జరుగుతూ ఉండేవి.  ఒకరికి ఒకరము  సాధనా  విషయముల మీద, సద్గ్రంధము ల గూర్చి విశ్లేషణ చేసుకొనే వారము.  ఈ విధముగా వారము రోజులు అయిపోయిన తరువాత  శ్రీ వెంకటేశ్వర్లు  గారు ఇక్కడికి దగ్గర లో కీసరగుట్ట లో ఒక ఆశ్రమము ఉంది అని, ఒక మహానుభావుడు తను ఉన్నతమైన స్థితి లో ఉద్యోగములో ఉండి కూడా దానికి  రాజీనామా చేసి ఆ  ఆశ్రమము ను  స్థాపింఛి  అందులో వివిధ కార్యక్రమములు చేస్తున్నారని చెప్పి మీరు ఆయనను చూద్దామని అనుకొంటే తీసుకు వెళ్తాను అని అన్నారు.   పెద్దలను కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవడము సాధన కు  మంచిదని తలచి వెంటనే సరే అన్నాను.  ఇద్దరమూ అయన దగ్గరకు వెళ్ళాము.  మేము వెళ్ళేటప్పటికే అక్కడ చాల మంది ఉన్నారు.  మేము కూడా కూర్చొన్నాము.  మమ్మలిని చూడగానే దగ్గరకు రమ్మనమని పిలిచారు.  నా వివరములు తెలిసిన  తరువాత,  అయన, నేను   దగ్గరగా ఒక గంట సేపు,  చుట్టూ ఇంకా చాల మంది మాట్లాడటానికి ఉన్నారన్న విషయము కూడా మరచిపోయి, ఆయన శిష్యులు గుర్తు చేసే వరకు కబుర్లలో పడి పోయాము.  నా గురువు అయన ద్వారా ముందు జరగబోయే విషయములు (సాధన గురించే) ఏమి ఎలా చేయాలో హెచ్చరించారు. ఆ  విషయము ఏమిటంటే,  నాయనా, నీ సాధన బాగా జరుగుతోంది. నీతో పాటు పది మందికి ఉపయోగ పడే సాధన చేస్తున్నావు.  నీవు సగము లో ఉన్నావు మిగిలిన సగ భాగము  పూర్తి చేయగల సామర్ధ్యము నీకు ఉన్నది, అయితే మధ్యలో నీకు కొన్ని మెరుపులు కనిపిస్తాయి, వాటిని లక్ష్య పెట్టకుండా మూలానికి చేరుకొనే ప్రయత్నము చేయి తస్మాత్ జాగ్రత! అని  అయన ద్వారా  చెప్పారు.  ఇలా చెప్పటము, అయన శిష్యులు వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పటము జరిగి పోయింది.  బాహ్య వాతావరణము లోనికి రాగానే, నీకు మంచే  జరుగుతుంది, నీవు వెళ్ళే ముందు ఈ ఆశ్రమము లో సాయిబాబా మందిరము కట్టాము, దత్తాత్రేయుని మందిర నిర్మాణము చేద్దామని అనుకొంటున్నాము.   మా వాళ్ళు  దత్త విగ్రహ ప్రతిష్ఠ జరగ పోయే స్థలము చూపిస్తారు, అ ప్రదేశములో నీవు ఒక్కసారి ధ్యానము చేసి రా అని అన్నారు.  ఆనందముగా ఆ ప్రదేశమునకు వెళ్ళాను.  అది ఎండా  కాలము,  మే నెల   అక్కడ కొండ ప్రదేశము కాబట్టి కొండ రాయి బాగా వేడి మీద ఉంది.  నాతో పాటు ఉన్న  వెంకటేశ్వర్లు గారిని చూసి,  మీరు నాతో చేస్తారా అని అడిగాను.  అయన ఈ ఎండలో నా వల్ల  కాదు అని అనగానే,  సరే సాయిబాబా మందిరము లో కూర్చోండి అని చెప్పి,  స్వామి నాకు కదా చేయ మని చెప్పారు అని అనుకొని ఆ ఎండలో రాయి మీద కూర్చొని ధ్యానము చేయటము మొదలు పెట్టాను.  ఒక నిమిషము లో ఆసనము క్రింద వేడి పోయి, నేను గాని నీటిలో కూర్చొన్నానా అనే భావన కలిగి, చేత్తో తడిమి  చూస్తే  ఆ ప్రదేశము వేడి గానే తగిలింది.  అక్కడ నా ధ్యానము ముగించుకొని వెళ్ళే ముందు రమ్మన్న విషయము గుర్తు కొచ్చి అయన దగ్గరకు వెళ్ళ గానే, నీకు ధ్యానము బాగా కుదిరిందా, ఏమైనా అనుభవము అయిందా అని నవ్వుతూ వెళ్లి రా! నీకు అంత మంచే జరుగు తుంది అని అన్నారు. ఆ  తరువాత  శ్రీ వెంకటేశ్వర్లు  గారిని ఒక సారి మాత్రమే కలిశాను.  ఆ  విధముగా సాధన లో ఎవరినైతే ఉద్దేశించి  చేస్తున్నామో వారిని ధృడ చిత్తము తో ఆశ్రయిస్తే,   మనము ఎవరి దగ్గరకు వెళ్లితే వాళ్ళ లోనే ఆయన ద్వారా మన సందేశము మనకు అందుతుంది.    ఇది  నా పూర్ణ విశ్వాసము.

1 comment:

  1. Jai guru datta, your articles are realistic, we request to post more good articles as per your experiences, also kindly post Sri datta tatva more articles so that we can know about lord datta.
    jai guru dev
    srinivas

    ReplyDelete