Sunday, 2 November 2014

శరీర మాధ్యమ్ ........

  24 తత్వములు  వరుసగా   పంచ భూతములు 5  (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము),   జ్ఞానేంద్రియములు  5 (చెవులు, చర్మము, కన్ను, జిహ్వ, ముక్కు)  తన్మాత్రలు  5 (శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము)   కర్మేంద్రియములు 5  వాక్కు  (నోరు), పాణి  (చేయి ), పాదములు , పాయువు (మల ద్వారము ), ఉపస్థ  (జననేంద్రియము)    అంతఃకరణ చతుష్టయము  4  (మనో, బుద్ధి, చిత్త, అహంకారములు)  మొదలగునవి  కలిపి ఈ స్థూల దేహము ఏర్పడినది  అని తెలుసుకోవాలి .  ఇది పిండాండము  అయితే  బ్రహ్మాండము  కూడా  24 మూలకము  లతో  ఏర్పడినది.   కాబట్టి పిండాండము  బ్రహ్మాండము  ఒకే రకముగా  ఏర్పడినవి  అని తెలుసుకోవాలి.  ఈ సృష్టి  లో  దేవ భాష  లో  చతుర్వింశతి  (24)  అన్నది  చాల సందర్భాలలో  వస్తూ  ఉంటుంది.  గాయత్రీ  మంత్రము  లో  24 అక్షరములు  (24 బీజాక్షరములు)  సృష్టి  లో  24  మూలకములకు  సంబంధం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు.  జగద్గురువు అయిన శ్రీ దత్త స్వామి కి కూడా  24 మంది  గురువులని  అంటే సృష్టిలో ఎక్కడ నుంచి అయిన మనము నేర్చుకోవలసినది  ఉందని  మన అందరికి తెలియచేస్తున్నారు.  అంతెందుకు  ఒక రోజుకు  కూడా 24 గంటలే కదా.  పూజ కార్యక్రమములలో కూడా  కేశవ నామాలు 24.   

No comments:

Post a Comment